రాష్ట్ర అధికారులకు కేంద్రం 'ఐఏఎస్' వరం
తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ (SCS) అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ (SCS) అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ మొత్తం 16 మంది అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి ఎంపిక చేసిన ఈ అధికారులను తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఎంపికైన అధికారుల జాబితా ఇదే
సెలక్షన్ లిస్ట్ - 2022 (11 మంది): డి. మధుసూదన్ నాయక్, ఎం.సత్యవాణి, జె.భవానీ శంకర్, జి.లింగయ్య నాయక్, ఎ. నరసింహా రెడ్డి, జి. వీరారెడ్డి, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, యు.రఘురామ్ శర్మ, పి.చంద్రయ్య, జి.ముకుంద రెడ్డి, ఎ.భాస్కర్ రావు.
సెలక్షన్ లిస్ట్ - 2023 (3 మంది): వై.వి.గణేష్, అబ్దుల్ హమీద్, బి.వెంకటేశ్వర్లు.
సెలక్షన్ లిస్ట్ - 2024 (2 మంది): ఎన్.ఖీమ్యా నాయక్, కె.గంగాధర్.
కోర్టు తీర్పునకు లోబడి నియామకాలు
కేంద్రం పదోన్నతులు కల్పించినప్పటికీ, ఒక నిబంధనను స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ (WP No. 32415/2023) తుది తీర్పునకు లోబడే ఈ నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయినప్పటికీ, సుదీర్ఘ కాలంగా ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్న అధికారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. గ్రూప్-1 స్థాయి నుంచి ఐఏఎస్ కేడర్‌కు ఎదగడం పట్ల ఎంపికైన అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వీరికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.



