ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం
విశ్వంభర, మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలో మాతృశ్రీ నగర్ వసంత్ నగర్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మందారపు సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ప్రజలకు ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, అందరూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వెనువెంటనే తగు చికిత్సలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కాలనీ వాసులు, మహిళలు పురుషులు భారీ ఎత్తున వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్ష శిబిరం రేపు కూడా అందుబాటులో ఉంటుందని ఈరోజు రానివారు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాదే శివ చౌదరి, భానుప్రకాష్, కొప్పిశెట్టి దినేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.



