సర్పంచి, వార్డు సభ్యునికి సన్మానం
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన సర్పంచి బిక్షపతి గౌడ్, ఇనుగుర్తి కి చెందిన వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్ లకు గౌడ యువజన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ నలమాస కృష్ణా గౌడ్ చేతులమీదుగా ఘన సన్మానం జరిగింది. మానుకోట జిల్లాలోని గౌడ సర్పంచులు,వార్డు సభ్యుల తోపాటు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లను జిల్లా కేంద్రం మానుకోటలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కృష్ణా గౌడ్ మాట్లాడుతూ, పరాయి పాలకులైన ముష్కర తురక నవాబులను తరిమికొట్టి తెలంగాణ గోలకొండకు తొలి స్వదేశీ హిందూ రాజుగా ప్రఖ్యాతిగాంచిన సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో సమస్యలపై పోరాడి పరిష్కరించాలని అన్నారు.



