విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం హోమం తాళ్లపల్లి గ్రామంలోని యుపిఎస్  స్కూల్లో  సోమవారం  విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు, కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. ఉపాధ్యాయులుగా ఇతర విద్యార్థులు వ్యవహరించారు. హెచ్‌ఎం రమేష్ విద్యార్థులను అభినందించారు. పాఠశాలను సందర్శించిన గ్రామ సర్పంచ్ వంగాల  స్రవంతి రమేష్ విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచినందుకుగాను పేరుపేరునా అభినందించారు.

Tags: