మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ 

మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ 

  • 13 ద్విచక్ర వాహనాలు సీజ్
  • ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం 

విశ్వంభర, సూర్యాపేట: వాహనాల తనిఖీలు, జరిమానాలు ప్రజల భద్రత కోసం,  రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్డు నందు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో భాగంగా మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ఐ తెలిపారు. నిరంతర వాహనాల తనిఖీలు, వాహనాల జరిమానాలు, ఎన్ఫోర్స్మెంట్ నిర్వహణ అనేది ప్రజల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణ కోసమేనని ఎస్ఐ సాయిరాం. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాక ఎదుటివారిని కూడా ప్రమాదంలో పడేస్తారని తెలిపారు. మైనర్ డ్రైవింగ్ అనేది చట్టాలు నేరమని పిల్లలు వాహనాలు నడుపుతూ దొరికినట్లయితే తల్లిదండ్రులపై వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కుకునే పిల్లలకు లైసెన్సులు కూడా రావని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: