ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

  • జిల్లా విద్యాశాఖ అధికారి  రాజేశ్వర్ 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లాలోని 45 పరీక్షా కేంద్రాలలో పడవ తరగతి  పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ 8147 మంది విద్యార్థులు అలాట్మెంట్ కాగా 8141 మంది విద్యార్థులు పరీక్షలకు  హాజరయ్యారు,  6 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు , వన్స్ ఫెయిల్డ్ లో 4  మంది విద్యార్థులు అలాట్ కాగా ముగ్గురు  విద్యార్థులు హాజరయ్యారు  కాగా ఒక్కరు గైర్హాజరు అయినట్లు  చెప్పారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రశ్నాపత్రాల భద్రత , పరీక్షల నిర్వహణలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్రాల వద్ద పోలీస్ భద్రత, తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స వంటి ఏర్పాట్లు కూడా చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు టీములు 20 సెంటర్లను తనిఖీ చేశారని తెలిపారు.

Tags: