పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి ఇంజక్షన్
విశ్వంభర, ఘట్కేసర్: యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చాడు. పోచారం ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఒక యువతితో వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి మాటలు కూడా జరిగాయి. అయితే కొద్ది రోజుల తర్వాత మనోహర్‌కు హెచ్‌ఐవీ ఉందని యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో యువతి వెంటనే పెళ్లికి నిరాకరించింది. పెళ్లి రద్దు కావడంతో మనోహర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. యువతి పెళ్లికి నిరాకరించడంతో మనోహర్ ముందే తీసుకువచ్చిన సిరంజ్‌తో ఆమెకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో మనోహర్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా గతంలోనే హెచ్‌ఐవీ ఉన్నట్లు బయటపడింది. ఈ విషయం తెలిసిన తర్వాతే యువతి పెళ్లికి నిరాకరించింది. యువతి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



