ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం 

ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం 

 విశ్వంభర, బషీర్ బాగ్: ప్రాచీన భారతీయ గణిత సంపద ముఖ్యంగా వేద గణితం ఆధునిక గణన పద్ధతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలుస్తుందని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికల పురుషోత్తం అన్నారు. శనివారం తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అని బిసెంట్ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సదస్సులో ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. గణితం కేవలం సంఖ్యలకే పరిమితం కాదని అది తార్కిక ఆలోచన సమస్య పరిష్కారం, ఆవిష్కరణలకు పునాది అని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డి. చెన్నప్ప ప్రసంగిస్తూ సంఖ్యల శాశ్విత జ్ఞానాన్ని స్మరించుకుంటూ విద్యార్థులు యువకులలో గణిత ఆలోచనను పెంపొందించడానికి మనందరం కట్టుబడి ఉండాలని అన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ స్కాలర్  మరియు ఎన్ఎస్ఎస్ యూత్ మోటివేటర్ డాక్టర్ రవితేజ చౌహన్ మాట్లాడుతూ ప్రపంచ గణిత శాస్త్ర దినోత్సవం  జగద్గురు భారతి కృష్ణ మహారాజ్ జయంతిని వేదిక్ మ్యాథమెటిక్స్ తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడుగా ప్రసిద్ధి చెందారని ఉదాహరణలతో తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గణిత శాస్త్రవేత్త అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వేదిక్ మ్యాథమెటిక్స్ నిపుణులు డాక్టర్ సాయికిరణ్ కు భారతికృష్ణ తీర్థ మహారాజ్ స్మారక గణిత ప్రతిభ పురస్కారం 2025 ను శాలువా పూలమాల జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రంతో ముఖ్య అతిథి ప్రొఫెసర్ పురుషోత్తం, డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి ప్రిన్సిపాల్ రాజవల్లి తదితరులు పాల్గొని డాక్టర్ సాయికిరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: