హెల్మెట్ ధరించండి .. ప్రాణాలు కాపాడుకోండి : వీహెచ్ 

హెల్మెట్ ధరించండి .. ప్రాణాలు కాపాడుకోండి : వీహెచ్ 

విశ్వంభర, నాంపల్లి  : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, విధిగా హెల్మెట్  ధరించాలని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాదు అసెంబ్లీ దారిలో హనుమంతరావు ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగ్ రూట్‌లో వెళ్లడం, ముగ్గురు ఒకే వాహనంపై ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని చెప్పారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు మోతే రోహిత్, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, నారాయణస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్. లక్ష్మణ్ యాదవ్, లక్‌పతి యాదగిరి గౌడ్ శంభుల శ్రీకాంత్ గౌడ్ , తొలుపునూరి కృష్ణ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ నేత, పంజాల వెంకటేష్ గౌడ్, జహంగీర్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: