కవి రాజిరెడ్డి కి అందెశ్రీ ఉగాది పురస్కారం

కవి రాజిరెడ్డి కి అందెశ్రీ ఉగాది పురస్కారం

విశ్వంభర, ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన అభ్యుదయ,ఆధునిక,భావ కవి శీలం రాజిరెడ్డిని రాష్ట్రస్థాయి అందెశ్రీ ఉగాది పురస్కారం వరించింది. సిద్దిపేటలో వెన్నెల సాహితీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం లో రాజిరెడ్డి పాల్గొని అందె శ్రీ తో తనకున్న సాహిత్య సన్నిహిత సంబందాలను సాటి కవులతో పంచుకొని లోక కవి అందె శ్రీ పై కవిత వినిపించారు.దీనిని కవులు,సభికులు మంత్రముగ్ధులై ఆలకించి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.అనంతరం తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా రాజిరెడ్డికి మెమొంటో,శాలువా పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కవి శీలం మాట్లాడుతూ, అందెశ్రీ తో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్నదని ఆయన పేరుతో పురస్కారం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు.

Tags: