పదో తరగతి పరీక్షలు ప్రారంభం
On
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల్లో పోలీసు బందోబస్తు నడుమ విద్యార్థులు మొదటి రోజు పరీక్షను రాసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. . హైదరాబాదు నగరంలోని ప్రధాన కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కొనసాగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.



