పటేల్ గూడలో ఇఫ్తార్ విందు
On
విశ్వంభర, సంగారెడ్డి: పటేల్ గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు ఇక్బాల్, శ్రీకాంత్, యునుస్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.



