రంజాన్  కానుకల పంపిణీ

రంజాన్  కానుకల పంపిణీ

విశ్వంభర, గుండాల : రంజాన్ పండుగ  సందర్భంగా ప్రభుత్వ విప్,  ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్మన్  బీర్ల అనిత రంజాన్ కానుకలను బండకొత్తపల్లి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ద్యాప కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్, వార్డు మెంబర్స్ ,కొడారి ఆంజనేయులు, బూర్గుల నర్సయ్య ,చీకటి ఉషా ఉపేందర్, దానెలు  పాల్గొని లబ్ధిదారులకు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంజాన్ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ననుబల ఎర్రయ్య , కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, జైపాల్ రెడ్డి ,డేవిడ్, సాయి, చింటూ, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: