బావిలో యువకుడి శవం
On
విశ్వంభర, ఛత్రినాక: హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 4వ తేదీన 20 సంవత్సరాల గౌతమ్ కుమార్ అనే వ్యక్తి అదృష్టమైనట్టు కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి రాజన్న బావి సమీపంలో పుల్లమ్మ బావి లో గుర్తు తెలియని మృతదేహాo ఉన్నదని స్థానికులు ఛత్రినాక పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్యాంక్ బండ్ శివ టీం తో మృతదేహాన్ని వెలికితీశారు. ఆ మృతదేహం గౌతమ్ కుమార్ దిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



