మృతుడి కుటుంబాన్నిఆదుకోవాలి
On
విశ్వంభర, మహబూబాబాద్ : డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగి షేక్ జమాల్ కి గత ఆరు నెలల నుండి వేతనాలు రావడం లేదని, ఆర్థిక ఇబ్బందులు తాళలేక జమాల్ ఆత్మహత్య చేసుకున్నారని ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కుమార్ తెలిపారు. తక్షణమే మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎన్ హెచ్ ఎం జేఏసీ సభ్యులు సమావేశమై రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులతో విషయాన్ని చర్చించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ఎన్హెచ్ఎం జిల్లా కమిటీ యూనియన్ తరపున డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలోఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు డా. కందుల నాగరాజు, ఉపాధ్యక్షులు దార్ల జ్యోతి, సువర్ణ , నవీన్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు .



