సీసీటీవీ కెమెరాలతో ప్రజలకు భద్రత

సీసీటీవీ కెమెరాలతో ప్రజలకు భద్రత

  • సిఐ సత్యనారాయణ

విశ్వంభర, ఇనుగుర్తి: సీసీటీవీ కెమెరాలు ప్రజల భద్రతకు ఉపయోగపడతాయని సిఐ సత్యనారాయణ అన్నారు. ఇనుగుర్తి మండలం రాము తండాలో గ్రామ సర్పంచ్ భూక్య మీటు నాయక్ 6 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో సీఐ ఇనుగుర్తి పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్సై కరుణాకర్ తో కలిసి  సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ,  సీసీటీవీ కెమెరాలు  శాంతి భద్రతల పరిరక్షణకు,నేరాల నివారణకు,అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకు,గ్రామ ప్రజల భద్రతకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. మండలం లోని సర్పంచులు, ఇతర ప్రముఖులు చొరవ తీసుకొని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags: