పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
విశ్వంభర, సూర్యాపేట: ఈరోజు నుండి ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాకతీయ హై స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాల పరీక్షా కేంద్రాలను ఎస్పి నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. పరీక్షా కేంద్రాల వద్ద నేషేద ఆజ్ఞలు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపినారు. పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. నిషేధ ఆజ్ఞలు ఉన్నందున పరీక్ష కేంద్ర పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు, వాహన హరన్ లు ఉపయోగించరాదని కోరారు, జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి అని కోరారు. వాహన పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులను వాహనాల్లో తరలించవద్దు అని కోరారు.



