దిలీప్ కుమార్‌కు శుభాకాంక్షలు

దిలీప్ కుమార్‌కు శుభాకాంక్షలు

విశ్వంభర, ఖమ్మం:  విశ్వంభర దినపత్రిక , V3 ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా స్టాఫర్ ఎలుగోటి వెంకట్ ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దల దిలీప్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వంభర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సంబంధించిన సమస్యలు, సామాజిక అంశాలు  ప్రభుత్వ కార్యక్రమాలపై మీడియా కీలక పాత్ర పోషిస్తుందని గద్దల దిలీప్ కుమార్‌ పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు , వ్యాపార రంగానికి సంబంధించిన వార్తలను నిష్పక్షపాతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుంభం రవికుమార్, నరసింహ యాదవ్, ఎస్కే మల్సూర్ పాల్గొన్నారు.

Tags: