ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
విశ్వంభర, హనుమకొండ: కాజీపేట సోమిడి శివారులోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సాయంత్రం వార్షికోత్సవవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత మత్తుపదార్థాలకు, సెల్ఫోన్ లకు బానిసలు కావద్దని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మంచి ఆశయాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల , పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ టివి పడుతా తీయగా విన్నర్ స్వరాగ్ కీర్తన్, ఆర్.జె. మమత, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల అధినేత తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు తాళ్ల వంశీ చైతన్య, వరుణ్ వైష్ణవి దంపతులు, ప్రిన్సిపాల్ డాక్టర్ వేలు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి,హెచ్.ఓ.డి. శిల్పా, మహేందర్, భాగ్యలక్ష్మీ,అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



