ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు
విశ్వంభర, బషీర్ బాగ్: ఉగాది సందర్బంగా 'లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-ఏ హైదరాబాద్' ఆధ్వర్యంలో ఈనెల 29న సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో 'లయన్స్ ఉగాది పురస్కారాల' ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్నర్ క్యాబినేట్ ఈవెంట్స్ ఉగాది సంబరాల చైర్మన్ లయన్ డా.ఈ.ఎస్.సూర్య నారాయణ తెలిపారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిస్ట్రిక్ట్ 320-ఏ చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ లయన్ పి.రమేష్ చంద్రబాబు, డిస్ట్రిక్ 320-ఏ ఇన్నర్ క్యాబినెట్ ఆడిషనల్ సెక్రటరీ లయన్ పి.ఉమా శంకర్ రెడ్డి లతో కలసి ఆయన మాట్లాడారు. ఈ పురస్కారాలను ముఖ్య అతిధిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-ఎ గవర్నర్ లయన్ జి.మహేంద్ర కుమార్ రెడ్డి, విశిష్ట అతిధులుగా, 1వ వైస్ డిస్ట్రిక్ గవర్నర్ లయన్ సురేష్ జగ్నాని, 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ శశికాంత్ హాజరవుతారని తెలిపారు. ఎంపిక కొరకు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నవారు వారి ప్రతిభను తెలియచేసే సర్టిఫికెట్స్ తోపాటు 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలను ధరఖాస్తుకు జతచేసి ఈనెల 20 లోపు తమ ఆఫీస్ అడ్రస్ లయన్స్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 320-ఎ, డోర్ నెం.1-20-164, గోకుల్ నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్-15కు పంపాలని కోరారు.



