ఏప్రిల్ 14న బ్లూ బ్లాక్ గ్రీన్ కవాతు
- డాక్టర్ పిడమర్తి రవి
విశ్వంభర, బషీర్ బాగ్: ఏప్రిల్ 14న 3 డిమాండ్స్ తో బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతు, సభ నిర్వహిస్తామని మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చీఫ్ ప్యాట్రన్ పిడమర్తి రవి, ప్యాట్రన్ సురేందర్ సన్నీ తెలిపారు. ఏప్రిల్ 14న సాయంత్రం నాలుగు గంటల నుండి బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు 250 గజాల ఇవ్వాలని, ఎస్సీలకు 20 శాతం, బీసీలకు 42 శాతం, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల జయంతి కంపెనీ ప్రకటించారు. మహానీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ గా కొండల శ్రీనాథ్ రావు, అధ్యక్షుడిగా ఎండి రహీం, కన్వీనర్ గా చందు నాయక్, మహిళా చైర్మన్ గా కోట ఉషారాణి, కన్వీనర్గా వరలక్ష్మి, విద్యార్థి జేఏసీ చైర్మన్ గా బోరెల్లి సురేష్, కన్వీనర్గా జోగు గణేష్, యూత్ కన్వీనర్ గా నక్క మహేష్, అధ్యక్షునిగా రింగు రాంబాబు ను నియమిస్తున్నామని తెలిపారు.



