బ్యాండ్ మోతతో అసెంబ్లీ దద్దరిల్లాలి

బ్యాండ్ మోతతో అసెంబ్లీ దద్దరిల్లాలి

విశ్వంభర, ముషీరాబాదు : విశ్వంభర, ముషీరాబాదు : బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాలో బ్యాండ్ మోతతో అసెంబ్లీ దద్దరిల్లాలి, అప్పుడు మాత్రమే పాలకులు మన సమస్యలపై స్పందిస్తారు అని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి. రమణ అన్నారు.శనివారం హైదరాబాదు ముషీరాబాదులోని వృత్తిదారుల భవనంలో బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం సమావేశం గరుడ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.వి. రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026–27 బడ్జెట్‌లో వృత్తిదారుల సంక్షేమానికి 25 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్యాండ్ వాయిద్య కళాకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్యాండ్ వాయిద్య కళాకారులందర్నీ ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. గీత నేత కార్మికులకు ఇచ్చినట్లే కళాకారులందరికీ పెన్షన్, ఎక్స్‌గ్రేషియా కల్పించాలని, ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 17న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే వృత్తిదారుల మహాధర్నాకు బ్యాండ్ వాయిద్య కళాకారులు తమ వృత్తి పరికరాలతో పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాదులో బ్యాండ్ వాయిద్య మేళా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏ హనుమంతు, పి ప్రవీణ్, మహమ్మద్ అనిల్, వాసు, నరసింహులు, బాబ్జి, సోను, శ్రీశైలం, వెంకటేష్, ఆయుఖాన్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags: