అంత్యక్రియలకు ఆర్థిక సాయం
On
విశ్వంభర, మర్పల్లి: మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వీరన్న తండ్రి కోనపురం నర్సింలు ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుకున్న బీజేపీ పార్టీ మర్పల్లి మండల అధ్యక్షుడు రామేశ్వర రెడ్డి బీజేపీ పార్టీ తరుపున బాధిత కుటుంబానికి అంత్య క్రియలకు రూ.6,500 సాయం చేశారు. స్థానిక నాయకులు బాధిత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్ కుమార్ , సిరిపురం నాగన్న, ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మధుకర్, ప్రవీణ్ శివకుమార్, ఘనపూర్ రమేష్, సంగమేష్, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.



