బీజేపీ ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కన్వీనర్‌గా సుంకర
విశ్వంభర, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం, సైనికులు రాజకీయంగా ఎదగడానికి ఒక వేదిక అవసరం అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో “ఎక్స్ సర్వీస్ మెన్ సెల్” ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెల్‌కు కన్వీనర్‌గా సూర్యాపేట జిల్లా వాసి రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు ని నియమించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా మాజీ సైనికుల సంక్షేమం కోసం సేవలందిస్తున్న అఖిల భారత పూర్వ సైనిక్ సేవా పరిషత్ తెలంగాణ ప్రాంత రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు సేవలను గుర్తించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఈ బాధ్యతలను వారికి అప్పగించింది.ఈ సందర్భంగా కల్నల్ సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల మాజీ సైనికుల అసోసియేషన్లతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను కూలంకషంగా చర్చించి రాష్ట్ర నాయకత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అఖిల భారత పూర్వ సైనిక్ సేవా పరిషత్ సభ్యులు, భూపాలల్లి, సిద్దిపేట తదితర జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.



