సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

విశ్వంభర, శంషాబాద్ : ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో ఓటిపిలు, బ్యాంకు వివరాలు పంచుకోవద్దు అని శంషాబాద్ డిసిపి సూచించారు. పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం తుక్కుగూడలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శంషాబాద్ డిసిపి, ఆర్జీఐ డివిజన్ ఏసిపి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ఫిషింగ్ దాడులు, నకిలీ లింకులు, ఓటిపి మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాల గురించి వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: