కారల్ మార్క్స్ కు నివాళి

కారల్ మార్క్స్ కు నివాళి

విశ్వంభర, పాల్వంచ : కారల్ మార్క్స్ 143వ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో ఆయన చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మార్క్స్ ఆలోచనలు కార్మికులు, శ్రమజీవుల హక్కుల సాధనకు దిశానిర్దేశం చేశాయని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణానికి మార్క్స్ సిద్ధాంతాలు ఇప్పటికీ మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా,మొన్న లక్ష్మి కుమారి, సర్పంచ్ సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: