ఘనంగా టెక్ స్ప్రింగ్ ఫెస్ట్
On
విశ్వంభర, హనుమకొండ : హనంకొండ జిల్లా 55 డివిజన్ భీమారం సమీపంలో ఉన్న ఎస్ వీ ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహిస్తున్నటెక్ స్ప్రింగ్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఇనాగురల్ సెషన్లకు ముఖ్య అతిథిగా శ్రీకాంత్ సిన్హా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.వైస్ చైర్పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజ్ మెంట్ సభ్యులు డా. ఈ.వి. రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



