శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తాం
విశ్వంభర, నాగారం: సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ యానాల చంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు కామ్రేడ్ చెరుకు శ్రీరాములు ప్రథమ వర్ధంతి సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ అధ్యక్షులు సంపేట కాశయ్య అధ్యక్షతన నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో స్థూపం ఆవిష్కరించి జెండా ఎగురవేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ స్థూపావిష్కరణ చేయగా,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాయి కృష్ణ చిత్రపటానికి పూలమాల జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ, తన చివరి శ్వాస వరకు ఎర్రజెండాను ఎత్తుకొని ప్రజల కోసం పనిచేసిన కామ్రేడ్ చెరుకు శ్రీరాములు ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. యానాల చంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడిగా పనిచేస్తూ అనేక కేసులను నిర్బంధాలను ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. గ్రామంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సారా ఉద్యమంలో చెరుకు శ్రీరాములు క్రియాశీలకంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. అమరవీరుల ఆశయ సాధన కోసం దోపిడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కార్యదర్శి జనార్ధన్, నల్లగొండ జిల్లా కార్యదర్శి సాగర్,బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు గాజుల శ్రీనివాస్, జనశక్తి పార్టీ నాయకులు పలస యాదగిరి, బొడ్డు శంకర్, సుధాకర్ రెడ్డి, పోలేబోయిన కిరణ్, సంపేట కృష్ణమూర్తి , సర్పంచ్ దోమలపల్లి సంధ్య గోవర్ధన్, ఉప సర్పంచ్ చెరుకుపల్లీ నాగరాజు ప్రజాసంఘాల నాయకులు గజ్జి రవి, పుట్టా సత్తయ్య లింగయ్య, ఉప్పలయ్య, వీరాచారి, శ్రీనివాస్, గణేష్ సైదులు,కాసం వీరయ్య రమేష్, దేవరకొండ కృష్ణ, రింగు శేఖర్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.



