భట్టి విక్రమార్క కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన చంద్రబాబు 

భట్టి విక్రమార్క కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన చంద్రబాబు 

విశ్వంభర, హైదరాబాద్ : ​ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ​​ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. మార్చి 5వ తేదీన సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే, అప్పట్లో ఉన్న అత్యవసర కార్యకలాపాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

Tags: