తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కొత్త హంగులు

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కొత్త హంగులు

  • ఆసుపత్రిలో పోర్టబుల్ ఎక్సరే సౌకర్యం 

విశ్వంభర, హైదరాబాద్ : తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో ముందడుగు పడింది. సామాజిక బాధ్యతలో భాగంగా కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ ‘క్యాన్ ఫిన్ హోమ్స్’ వారు రూ. 20 లక్షల విలువైన అత్యాధునిక ‘మొబైల్ డిజిటల్ పోర్టబుల్ ఎక్సరే’ మిషన్‌ను ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. ఈ నూతన యంత్రాన్ని కెనరా బ్యాంక్ తెలంగాణ జోనల్ హెడ్ గూడ లక్ష్మణ్,ఆసుపత్రి సూపరింటెండెంట్, సిఎమ్ఓ  శైలజ మూర్తి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా  శైలజ మూర్తి మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా బ్యాంకింగ్ సంస్థలు ముందుకు వచ్చి తమవంతు సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ మొబైల్ డిజిటల్ పోర్టబుల్ ఎక్సరే మిషన్ అందుబాటులోకి రావడంతో వార్డుల్లో ఉన్న పేషంట్ల  వద్దకే నేరుగా వెళ్లి ఎక్సరే తీసే అవకాశం ఉంటుందని, దీనివల్ల రోగులకు మరింత త్వరితగతిన, మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె వివరించారు. ​కెనరా బ్యాంక్ తెలంగాణ జోనల్ హెడ్  గూడ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వీసీ, ఎండీ నాగిరెడ్డి  నేతృత్వంలో తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్, సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కెనరా బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ అడ్మినిస్ట్రేటర్  పి. శ్రీనివాస్, కెనరా బ్యాంక్ మేనేజర్లు టి.టి. అచ్యుతానందం, అశోక్ గౌతమ్, పలువురు వైద్యులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: