28న రామన్నపేటలో జాతీయ లోక్ అదాలత్ 

28న రామన్నపేటలో జాతీయ లోక్ అదాలత్ 

విశ్వంభర, రామన్నపేట :యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ గౌరవ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సూచనల మేరకు రామన్నపేట మండల కేంద్రంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో ఈ  నెల 28న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న సందర్బంగా సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ గౌరవ కార్యదర్శి వి.మాధవి లత, రామన్నపేట మండల న్యాయ సేవా సమితి గౌరవ చైర్‌పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, రెండవ తరగతి మేజిస్ట్రేట్ కోర్టు రామన్నపేట న్యాయమూర్తి డి.సత్తయ్య లు పాల్గొన్నారు. అదే విధంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏపిపి నిజాముద్దీన్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎస్.శ్రవణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ.మజీద్, బార్ సభ్యులు, అలాగే ప్యానల్ అడ్వకేట్లు ఎం.వెంకట్ రెడ్డి, బి.డేవిడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్ విభాగం నుంచి రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, మోత్కూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు, వలిగొండ సబ్-ఇన్‌స్పెక్టర్ వి.యుగేందర్, అడ్డగూడూరు సబ్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకట్ రెడ్డి, రామన్నపేట ఏఎస్‌ఐ సురేందర్, అలాగే రామన్నపేట ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శివకృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశంలో 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌కు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పెండింగ్ కేసులపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, తమ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించు కోవాలని న్యాయమూర్తులు సూచించారు. ఈ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందచేయాలని, పోలీసు వారు ముందస్తుగా లోక్ అదాలత్ నోటీసులను రాజీకి ఆమోద యోగ్యమగు కేసులలోని కక్షిదారులకు అందచేయాలని, రామన్నపేట కోర్టు పరిధిలోని ప్రతీ మారుమూల గ్రామములోని ప్రజలకు ఈ లోక్ అదాలత్ నిర్వహణ సమాచారం అందచేసేలా విస్తృత ప్రచారం చేయాలని కోరారు.

Tags: