ప్రతిఒక్కరికి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి. - క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు
On
విశ్వంభర, నల్లగొండ :- జిల్లా కేంద్రంలో బీసీ రెసిడెన్షియల్ బాయ్స్ హై స్కూల్ లో మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కార్యక్రమం క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరికి వినియోగదారుల హక్కులపై పై అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలనీ వారు అన్నారు. మహాత్మ గాంధీ యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్ మధు, నలగొండ జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు అనబోయిన మట్టయ్య, ప్రధాన కార్యదర్శి కట్ట మనోహర్, ఉపాధ్యక్షులు ఎండి ముస్తఫా, బీసీ రెసిడెన్షియల్ కన్జ్యూమర్ క్లబ్ కన్వీనర్ బి. భవనా ఋషి మరియు విద్యార్థులు పాల్గొన్నారు



