టిటిడిపి పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గద్దె విజయ్ నేత
On
విశ్వంభర , హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ ని ప్రముఖ సామాజికవేత్త , బి ఎన్ రెడ్డి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత మల్కాజిగిరి ఆడ కమిటి సభ్యుడు మరియు వారి మిత్ర బృందం మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలవడం జరిగింది. ఈ సందర్బంగా గద్దె విజయ్ నేత అరవింద్ కుమార్ గౌడ్ ని శాలువాతో సన్మానం చేశారు. అరవింద్ కుమార్ గౌడ్ , ఎల్బీనగర్లో తెలుగుదేశం పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలను గురించి గద్దె విజయ్ నేత తో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్, రవి, నాగరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



