నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం 

నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం 

విశ్వంభర, గచ్చిబౌలి : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం తదితర సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మరో రెండు రోజుల్లో కోలుకునే అవకాశముందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. శనివారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ నాయకులు బి వెంకట్, టి సాగర్, ఎండి అబ్బాస్, భూపాల్, ఆర్ వెంకట్రాములు, పి జయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

Tags: