మరింత విస్తృతంగా పోలీస్ సేవలు

విశ్వంభర, నిజామాబాద్ :  శాంతి భద్రతల నిర్వహణలో తరుచు తలెత్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి అవసరమైన కార్యాచరణ ఫై కమిషనర్ కసరత్తులు చేస్తున్నారు పోలీసింగ్ మరింత విస్తృతంగాఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఆయా స్టేషన్ లకు హౌస్ ఆఫీసర్ లుగా ఎస్సై ను తప్పించి సీఐ స్థాయి కి పెంచారు. ముఖ్యంగా నగర పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది అధికారులు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా నే నిజామాబాద్ సబ్ డివిజన్ ను రెండు గా విభజించనున్నారు. సబ్ డివిజన్ ను రెండు గా విభజిస్తే మరో ఏసీపీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధి లో 16 పోలీసు స్టేషన్ లున్నాయి తెలంగాణ లోనే అతి పెద్ద సబ్ డివిజన్ లలో నిజామాబాద్ ఒకటి !విస్తృతమైన పరిధి వుండడం వల్ల ఏసీపీ లకు పనిభారం పెరుగుతుంది. అదీగాక విపత్తులు తలెత్తిన వెంటనే ఏసీపీ వెళ్లాలంటే గంటల తరబడి గా ఆలస్యం అవుతుంది. ఎలాగో డిఎస్పీ స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నారు కాబట్టి నిజామాబాద్ రెండు సబ్ డివిజన్ ను రెండు గా విభజిస్తే మరో ఏసీపీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags: