ధర్పల్లి లో ఏసిపి పర్యటన
విశ్వంభర, నిజామాబాద్: ధర్పల్లి మండలం,హోన్నజీపేట గ్రామంలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు విషయమై ఏసిపి ప్రకాష్ గ్రామాన్ని సందర్శించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. అనంతరం గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయం చేసే విధంగా కేసు విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. కేసులపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని చట్టాన్నికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి ప్రకాష్ తెలిపారు. అనంతరం సీఐ బిక్షపతి ఎస్సై సోమ శ్రీనివాస్. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతామని మహిళ హత్య కేసు కు సంబంధించి ఘటన స్థలం స్వయంగా సందర్శించి ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించి కేసు కొనసాగించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారులు నేరుగా పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఏసిపి కార్యాలయంలో కానీ ఫిర్యాదు చేయొచ్చని ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పోలీస్ వారిని సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన లేదా పేకాట ఆడుతున్నారని సమాచారం వెంటనే పోలీసులకు, అందించాల్సిందిగా ఆయన కోరారు. సిఐ బిక్షపతి, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



