విద్యార్థినికి సన్మానం
On
విశ్వంభర, కేసముద్రం : మహబూబాబాద్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి 'బాలవక్త' పోటీలలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినిని పాఠశాలలో సన్మానించారు. మహబూబాబాద్‌లో శ్రీ వీరభద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలవక్త పోటీలలో కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని గోవిందు శ్రీవిద్య డిజిటల్ విద్య వరమా, శాపమా అనే అంశంపై ప్రసంగించి ద్వితీయ స్థానం సాధించింది.ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



