రేగడితండాకు సిసి రోడ్డు
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని పెద్ద తండా గ్రామపంచాయతీ పరిధిలోని రేగటి తండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను సర్పంచి బానోతు రేణుక నరేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా రేగడి తండా అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం తండావాసులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారన్నారు. సరైన రోడ్లు,అంతర్గత దారులతోనే తండా అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. గ్రామపంచాయతీ పాలకమండలి తండా వాసుల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి బాధావతు శిరీష, వార్డు సభ్యులు బిక్షం,సంతోష్,నరహరి,లక్ష్మీ,కవిత కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలు, నాయకులు బిచ్చ, సీత,వెంకన్న,రవి,శ్రీను,శోభన్,దంజా సిబ్బంది సరోజ తదితరులు పాల్గొన్నారు.



