టెస్కో డైరెక్టర్ రేసులో వర్కాల శ్రీనివాసులు..! - శాబ్దుల్లాపురం చేనేత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ గా ఏకగ్రీవం.
చేనేత రంగం పై 30 సం.రాల అనుభవం ఉంది.
విశ్వంభర, కనగల్ /శాబ్దుల్లాపురం :- టెస్కో లో గత 30 సంవత్సరాలుగా సేల్స్ మెన్ గా ఉద్యోగం చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని శాబ్దుల్లాపురం చేనేత పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికల్లో వర్కాల శ్రీనివాసులు పోటీ చేయడం జరిగింది. తన సొంత సంస్థలో పనిచేసిన అనుభవంనీ పరిగణనలోకి తీసుకుని చేనేత కార్మికులు ఏకగ్రీవ ఎన్నిక ద్వారా తనని అధ్యక్షుడిగా, తన ప్యానెల్ సభ్యులను కూడా ఏకగ్రీవముగా ఎన్నుకున్నారు. శాబ్దుల్లాపురం చేనేత పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికల్లో వర్కాల శ్రీనివాసులును చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సంఘం చైర్మన్ గా ఏకగ్రీవంగా అవకాశం కల్పించిన శాబ్దుల్లాపురం చేనేత పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. ఈ సంఘాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రము లో మోడల్ ఆదర్శ సంఘం గా గుర్తింపు తీసుకొస్తానని, చేనేత కార్మికులకు అన్నీ విధాలుగా సంఘం తరుపున , వ్యక్తిగతం గా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నా ఎన్నికకు సహకరించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు. అలాగే నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరిగే చేనేత సహకార సంఘాలలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాబ్దుల్లాపురం చేనేత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికైన నేను జిల్లా టెస్కో బోర్డు డైరెక్టర్ గా పోటీలో ఉంటానని , సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాకు డైరెక్టర్ గా అర్హుడునని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థకోసం చేనేత ఉత్పత్తులను సంఘాల సభ్యులకు అందించాలని ప్రతి చేనేత కార్మికుడికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంఘాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తనకు ప్రతి ఒక్క సంఘాల అధ్యక్షులు సహకరించి మద్దతు ఇవ్వాలని తాను కోరుతానని ఈ సందర్బంగా తెలియజేశారు.