ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలిస్తే ఆందోళన చేపడుతాం
- ప్రభుత్వాన్ని హెచ్చరించిన వామపక్షాలు
విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ ను వేరే మండలాలకు తరలించే యోచనను వెంటనే విరమించుకోవాలని,లేని పక్షంలో వామపక్ష పార్టీలు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు,యువకులు,వెరసి అన్ని వర్గాలతో కలిసి ఆందోళన చేపడుతామని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. మండల కేంద్రంలో బుధవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నేత కా.ఇరుగు అనిల్, సిఐటియు పెరుమాండ్ల బాబు గౌడ్, సిపిఎం ఇసంపల్లి సైదులు, సిపిఐ బైసా స్వామి,న్యూ డెమోక్రసీ ఆలకుంట్ల సాయిలు సంయుక్తంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీల పేద వర్గాల పిల్లలు అధికంగా ఉండడంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసి, తిరిగి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తుండడం పేదలకు విద్య దక్కకుండా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తరలించాలని ఆలోచన వెనక్కి తీసుకొని వెంటనే పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు.