బీజేపీ పాలనలో జరుగుతున్న అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విశ్వంభర, హైదరాబాదు : ఆర్ఎస్ఎస్–బీజేపీ పాలనలో జరుగుతున్న అవినీతి, ప్రజాస్వామ్య సంస్థల బలహీనతపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సమాజ్‌వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. బుధవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో "బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలనలో అయోధ్య రామమందిరం లూటీ" అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై వినియోగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతు న్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉపాధి, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అయోధ్య రామమందిరం వ్యవహారానికి సంబంధించి వెలువడుతున్న ఆరోపణలపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన రాజకీయ నాయకత్వం అవసరమన్నారు. ఆర్ఎస్ఎస్‌కు రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఆర్థిక లెక్కల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. దేవాలయాల ఆర్థిక వ్యవస్థపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ఆధ్యాత్మికత పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, అయోధ్య రామమందిరం వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ప్రొఫెసర్ వి.ఎల్. విశ్వేశ్వరరావు, దొమాట వెంకటేశ్, తోట రమేష్, బండి సదానంద్, మాస్టర్, జి. రాములు, పోలా జనార్ధన్, అభిషేక్ యాదవ్ తదితరులు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-corruption-going-on-under-bjp-rule-should-be-taken/article-18320

Tags: