బాలికలకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ

విశ్వంభర, నెల్లికుదురు: బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా నెల్లికుదురు మండలం వావిలాల ప్రాథమికోన్నత పాఠశాల బాలబాలికలకు మహిళా సాధికారత జిల్లా ఇన్చార్జి మహేశ్వరి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాగి నీరజ ఆధ్వర్యంలో హెచ్ఎం అడుప కరుణాకర్ అధ్యక్షతన బుధవారం స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. వీటిని ఎంఈఓ ఆంగోతు రాందాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బాలికలు విద్యావంతులై శాస్త్రవేత్తలుగా,డాక్టర్లుగా, సాఫ్ట్వేర్,రాజకీయ వెరసి అన్ని రంగాలలో దూసుకుపోతున్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని బాలికలు విద్యా వికసితులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, అరుణ, సంధ్య, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, కనీజ్ కష్పుల్ వరా, సంతోష్, నవీన్, రజనీ, ప్రవీణ్ కుమార్, అంగన్‌వాడీ టీచర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-school-bags-and-notebooks-to-girls/article-18310

Tags: