మహిళల రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి 

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించి వెంటనే అమలు చేయాలి అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత అధ్యక్షురాలు పి.కే. శ్రీమతి డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాదు భాగ్‌లింగంపల్లి చౌరస్తాలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అధ్యక్షతన మహిళల రాజకీయ రిజర్వేషన్ అమలును కోరుతూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.కే. శ్రీమతి మాట్లాడుతూ, దేశ జనాభాలో సగం ఉన్న మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమన్నారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో మహిళల రిజర్వేషన్ అమలును ఆలస్యం చేయకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు పుణ్యవతి మాట్లాడుతూ, మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లును ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. జ్యోతి, ఆశలత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సరళ, బండి పద్మ, పాలడుగు ప్రభావతి, బుట్టపల్లి, మాచర్ల భారతి, రత్నమాల, అనురాధ, గీత, వినోద, శశికళ, షబానా, వరలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-womens-reservation-bill-should-be-passed-immediately/article-18324

Tags: