వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి పనిచేద్దాం

వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి పనిచేద్దాం

విశ్వంభర,  గుండాల: దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గుండాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్త మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పాలనకు వైఎస్సార్ ఆదర్శప్రాయ నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఏఎంసీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు ఏలూరి రామ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పొడిచెట్టి వెంకన్న, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-work-towards-the-aspirations-of-ysr/article-18373

Tags: