వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్ నాయకులు

విశ్వంభర, హుస్నాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, వైఎస్సార్‌కు హుస్నాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులతో పాటు ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎండి హసన్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ysr-services-are-memorable-congress-leaders/article-18365

Tags: