సర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, సిద్దిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఓటరు సర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్వోతో కలిసి గురువారం ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చే బీఎల్వోలకు సరైన సమాచారం ఇవ్వకుంటే ఓట్లు గల్లంతు అవుతాయని చెప్పారు. సర్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ఛైర్మన్ రషద్, అసెంబ్లీ యువజన అధ్యక్షుడు వహాబ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.