సిద్దిపేట పరిశుభ్రపేట

సిద్దిపేట పరిశుభ్రపేట

  •  మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు

సిద్దిపేట, విశ్వంభర : సిద్దిపేటను పరిశుభ్రపేటగా మార్చుకున్నామని, ఒకప్పుడు సిద్దిపేట అంటే సందులు, పందులు ఉండేవని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు పందులు లేకుండా చేశామని, ఇరుకు సందుల్లోని మురికి కాల్వలను తీసేసి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించామని తెలిపారు. చెత్త కుప్పలు, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా మార్చామని చెప్పారు. ప్రతీ వార్డులో 90-95శాతం సిమెంట్ రోడ్లు వేసుకున్నామని, మిగిలినవి కూడా పూర్తి చేసుకుందామన్నారు. జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని ఇన్‌ఛార్జి కంతుల నర్సింలుతో కలిసి హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు తాగు నీరు లేక ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు తాగుతున్నామని చెప్పారు. వారానికోసారి నీళ్లు వచ్చేవని, కాళేశ్వరం, మల్లన్నసాగర్ నిర్మించాక ప్రతి రోజూ ఇంటింటికీ మంచినీళ్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్కీమ్‌లు లేవని అన్నీ స్కామ్‌లేనని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ బీడీ కార్మికురాలికి, అవ్వాతాతలకు రూ.62వేలు బాకీ పడ్డారని వివరించారు. ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం కలుపుతామన్నారని, బంగారం రాలేదు కానీ, ధర మాత్రం పెరిగిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం, మహాలక్ష్మి, రూ.4వేల పింఛన్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మోసాలేనని ధ్వజమెత్తారు. వెటర్నరీ కాలేజీ సగం నిర్మించాక రేవంత్ రెడ్డి కొడంగల్‌కు ఎత్తుకుపోయాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ స్కామ్‌ల ప్రభుత్వం పోయి, మళ్లీ మన స్కీమ్‌ల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కప్పలకుంటను అభివృద్ధి చేయడానికి కోటి రూపాయలు మంజూరు చేయించానని, తొందరలోనే చెత్తంతా తీయించి వాకింగ్ ట్రాక్, లైటింగ్, కుర్చీలు, పిల్లల ఆట వస్తువులు పెట్టిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు జంగిటి కనకరాజు, సజ్జు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్, మారెడ్డి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/siddipet-is-clean/article-17236

Tags: