రాహుల్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం
- అంకం రాహుల్ కేసులో కీలక మలుపు.. రీ-పోస్ట్‌మార్టం, సీబీఐ విచారణకు డిమాండ్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఇంజినీరింగ్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద మృతి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదుకు వచ్చి రాహుల్ తల్లిదండ్రులతో సమావేశమైనట్లు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. రాహుల్‌కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం నిర్వహించి, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. హత్య వెనుక ఉన్న అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. 40 రోజులు గడిచినా తెలంగాణ పోలీసులు కేసులో ఆశించిన పురోగతి సాధించలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రాలేదని, ఇప్పటివరకు దీనిని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించలేదని తెలిపారని చెప్పారు. దిశ కేసులో కనిపించిన వేగం రాహుల్ కేసులో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించిన దాసు సురేశ్, బాధితుడు బలహీన వర్గానికి చెందిన విద్యార్థి కావడం వల్లే నిర్లక్ష్యం జరుగుతోందా అని నిలదీశారు. సంబంధిత కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, కళాశాలల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఏఐసీటీఈ, యూజీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ అధికారులకు ఫిర్యాదులు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని, దోషులకు శిక్ష పడే వరకు ఉద్యమం కొనసాగుతుందని దాసు సురేశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి మహిళా గౌరవ అధ్యక్షురాలు బోనం ఊర్మిల, జాతీయ లీగల్ కార్యదర్శి రాజ్ కుమార్, సీఈఓ పోషల సరస్వతి, సూరజ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.