ఉప్పలయ్యకు ఎరుకల రాష్ట్ర సంఘం సన్మానం
విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఎరుకుల సంఘానికి అధ్యక్షులుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్ననాగరం గ్రామానికి చెందిన మాదగాని ఉప్పలయ్యను బుధవారం హైదరాబాదులో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతుడి కుమార్ నివాసంలో ఘనంగా సన్మానించింది. స్టేట్ ప్రెసిడెంట్ కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లగొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కేతిరి ఉప్పలయ్య తదితర ప్రభృతులు శాలువాలు పూలమాలతో ఉప్పలయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇనుగుర్తి ఎరుకల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మాదగాని ఉప్పలయ్యను అభినందించారు. ఎరుకల జాతి హక్కులు,సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. సంఘం మండల అధ్యక్షులు ఉప్పలయ్య మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా అందరి సహకారంతో హక్కులు ,సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడిగడ్డ శైలజ, మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి పేరంబక్కయ్య,సీనియర్ నాయకులు మాదగాని వెంకటేశం వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.