గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు–గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి సీతక్క
విశ్వంభర, మహబూబాబాద్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, గ్రామ కార్యదర్శులు సమన్వయంతో అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మహబూబాబాద్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 482 మంది సర్పంచులు, 405 మంది గ్రామ కార్యదర్శులకు పంచాయతీరాజ్ చట్టం, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై శిక్షణ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, ఉపాధి హామీ పనులు, జలసిరి కార్యక్రమం, మహిళా భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని అన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసి జలసిరి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించగా, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గ్రామాభివృద్ధిలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.